మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 12:46:51

కల్యాణ్‌రామ్‌కు ఎన్టీఆర్‌, పూరి విషెస్‌..

కల్యాణ్‌రామ్‌కు ఎన్టీఆర్‌, పూరి విషెస్‌..

నందమూరి కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ 2003లో ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాతో కెరీర్‌లో తొలి హిట్‌ అందుకున్న ఈ నందమూరి వారసుడు అసాధ్యుడు, విజయదశమి, లక్ష్మీకల్యాణం, హరేరామ్‌, జయీభవ వంటి సినిమాలు తీశారు. కల్యాణ్‌రామ్‌ నందమూరి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కిక్‌2, టెంపర్‌, ఇజం వంటి సినిమాలు కూడా నిర్మించాడు. పటాస్‌ సినిమాతో భారీ విజయం అందుకున్న కల్యాణ్‌రామ్‌ ఇటీవల తీసిన 118 సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ఎంత మంచివాడవురా సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సతీశ్‌ వేగేశ్న దర్శకుడు. ఆదివారం కల్యాణ్‌రామ్‌ జన్మదినం సందర్భంగా నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌, హాస్యనటుడు వెన్నెల కిశోర్‌తో పాటు పలువురు నటీనటులు, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. logo