శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 21:36:40

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్ విప్ల‌వాత్మ‌కం..సీఎంకు ఎన్ఆర్ఐల ధ‌న్య‌వాదాలు

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్ విప్ల‌వాత్మ‌కం..సీఎంకు ఎన్ఆర్ఐల ధ‌న్య‌వాదాలు

రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా  తీసుకొచ్చిన ధరణి పోర్ట‌ల్ విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యమ‌ని ఎన్ఆర్ఐలు పేర్కొంటున్నారు.   ‘ధరణి’ అందుబాటులోకి తెచ్చి రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు. 

టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూస‌రి మాట్లాడుతూ..విప్లవాత్మ‌కమైన ధరణి పోర్టల్ ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తూ, రెవెన్యూ వ్యవస్థ లో ఉన్న అవినీతిని నిరోధిస్తూ, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తా అన్న కేసీఆర్ మాటలను నిజం చేస్తూ , ఈ రోజు నుండి ధరణి మనకు సేవలు ఆంచించ‌బోతుంది. సామాన్యుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎన్ఆర్ఐల‌కు ధరణి ఒక వరంలా మారబోతుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి, భూ స‌మ‌స్యలు  కావొచ్చు, రిజిస్ట్రేషన్స్, మ్యుటేషన్ ఏ పనైనా సులువుగా ఆన్ లైన్ లో ఒక క్లిక్ తో ఏ దేశం నుండైనా సమస్యని  పరిష్కారం చేసుకునే అవకాశం మనకు ధరణి ద్వారా ఉండబోతుంది. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికిన ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కు,  ఎన్నారై సమస్యలపై  దృష్టి సారించిన కే.టీ.ఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్టు చెప్పారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్య‌క్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి ధరణి పోర్టల్ ప్రారంభించి మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యల పరిష్కారం మన ఈ ధరణి పోర్టల్ ద్వారా సులభతరం చేసినందుకుగాను కెసిఆర్ నా ప్రతేక్య కృతజ్ఞతలు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి కృషి చేసినటువంటి కెటిఆర్  కు, మహేష్ బిగాల‌కు అలాగే టీం అందరికి నా తరుపున, మా ఎన్ఆర్ఐల‌ అందరి తరుపున ప్రతేక్య ధన్యవాదాలు 


ధ‌ర‌ణితో  తెలంగాణ ఎన్నారైల‌కు ఎంతో ఉప‌యోగం : టీఆర్ఎస్ ‌సింగపూర్ 

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రారంభించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని టీఆర్ఎస్ సింగపూర్ ‌శాఖ సభ్యులు రావు రంజిత్  కుమార్, అరుణ్ గౌడ్ , జితేంధర్  రెడ్డి తెలిపారు. ఈ పోర్ట‌ల్ ప్రారంభంతో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో న‌వ శ‌కానికి తెలంగాణ ప్ర‌భుత్వం నాంది ప‌లికింద‌న్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా విదేశాల్లో ఉంటున్న తాము.. భూముల వివ‌రాల‌ను తెలుసుకునేందుకు సుల‌భంగా ఉంటుంద‌న్నారు. ఎన్నారైలకు ఇది ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్నారైల ప‌క్షాన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


* అధ్యక్షుడు టి.డీ.ఎఫ్ యూకే & యూరోప్ శ్రవణ్ గౌడ్ బైరు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ వలన ప్రజలకి మేలు ఎక్కవ జరుగుతుంది అని నా ప్రగాఢ‌ అభిప్రాయం. ఇందులొనీ  ముఖ్య అంశాలు ప్రజలకి ఉపయోగ పడేవి.

* పారదర్శకత

* వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తి

* కొత్తగా కొనే వాల్లు ధరణి పోర్టల్ లొనే స్లాట్ బూకింగ్ పద్ధతి 

  ద్వారా   

  చేసుకొవచ్చు 

* వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు పాస్ పుస్తకాలు వెంటనే 

  పొందవచ్చు.

* ఒక వేల ప్రాపర్టీ టాక్ష్ ఐడెంటిఫికేషన్ నంబర్ మార్చుకోవాలంటే 

  మ్యుటేషన్ ద్వార మార్చుకోవచ్హు. 

* అన్నీ పనులు ధరణి పోర్టల్ లొనే చేసుకొవచ్చు.

* ప్రభుత్వ భూముల గుర్తింపు మరియు కబ్జా కు స్వస్తి 

* ఆన్ లైన్ ద్వార అన్నీ పనులు మరియు ప్రభుత్వ జవాబుదారీతనం

* ప్రావాసతెలాంగాణేతరలుకు కొంత వెసులుబాటు చేయాలి. 

* ఆధార్ కార్డ్ బదులు ఓసీఐ (ఒవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా) -ఇది ఇండియన్ పాస్పోర్


ధరణి పోర్టల్ ప్రారంభంపై తెరాస మలేషియా హర్షం ..

దేశంలోనే మొదటిసారిగా దళారీ వ్యవస్థను పక్కనపెట్టి నేరుగా కొనుగోలుదారునికి అమ్మకందారునికి వారధిలా ఉండేలా ఈ ధరణిని రూపొందించారని పోర్టల్ ప్రారంభోత్సవం సందర్బంగా టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత పేర్కొన్నారు. 

దేశ చరిత్రలోనే ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుని ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా మిగిలిన రాష్ట్రాలు కూడా ఇక్కడ తెలంగాణాలో అమలవుతున్న పథకాలను వారి రాష్ట్రాల్లో అమలుపరుస్తున్నారనేది అందరికీ తెలిసిన సత్యం. మిగిలిన పథకాల్లాగే ఇది కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది మిగిలిన వారికి ఆదర్శప్రాయమవుతుందని తెరాస మలేషియా ఉపాధ్యక్షులు మారుతి కుర్మ,  కార్యదర్శి గుండా వెంకటేశ్వర్ లు పేర్కొన్నారు. 


సామాన్యుడి స్వప్నం ధరణి పోర్టల్: ప‌విత్ర రెడ్డి కంది, ఎన్నారై లండన్

సీఎం కెసిఆర్  నేడు ప్రారంభించిన ధరణి పోర్టల్ సామాన్యుడి పాలిట వరం. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అవినీతిని అరికట్టడానికి ధరణి ఉపయోగపడుతుంది, మా లాంటి ఎన్నారైలు ఎక్కడున్నా తెలంగాణ నలుమూలల ఉన్న  ల్యాండ్, ప్రాపర్టీ వివరాలని పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. రెవెన్యూ డిజిటలైజేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్ అవుతుందని తెలిపారు.


సామాన్యులకి ఎంతో ఉపయోగం: శ్రీవిద్య పింగళి , ఎన్నారై లండన్

మన తెలంగాణ సీఎం కెసిఆర్ ఈరోజు ధరణి పోర్టల్ లాంచ్ చేశారు, ఎప్పటి నుండో  వెయిట్ చేస్తున్నాము ఈ పోర్టల్ కోసం, దీని ఫీచర్స్ చూస్తే మనం ఎక్కడున్నా ల్యాండ్ & ప్రాపర్టీ వివరాలని ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది, ముఖ్యంగా రెవిన్యూ వ్యవస్థలో ఉన్న అవినీతిని అరికట్టి, పారదర్శకతని పెంచి సామాన్యులకి ఎంతో ఉపయోగపడుతుంది మా భావన. దేశం లో ఎక్కడా లేని నూతన విధానాన్ని తీసుకొచ్చిన కెసిఆర్ కృతఙ్ఞతలు.