మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Aug 25, 2020 , 19:05:28

ఆదిపురుష్ కోసం మ‌రో న‌టితో చ‌ర్చ‌లు

ఆదిపురుష్ కోసం మ‌రో న‌టితో చ‌ర్చ‌లు

టాలీవుడ్ యాక్ట‌ర్ ప్ర‌భాస్ 21వ ప్రాజెక్టుగా ఆదిపురుష్ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓం రావ‌త్ ఇటీవ‌లే ఈ సినిమాను ప్ర‌క‌టించాడు. టీ సిరీస్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. ఆది పురుష్ లో ఫీమేల్ లీడ్ కోసం ప్ర‌భాస్ అండ్ టీం మ‌హాన‌టి ఫేం కీర్తిసురేశ్ ను సంప్ర‌దించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌రో న‌టి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. తెలుగు, హిందీ భాష‌ల్లో మంచి ఫాంలో ఉన్న కైరా అద్వానీని ఆదిపురుష్ లో ఎంపిక చేసిన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.

మ‌రి కైరా అద్వానీ సెలక్ష‌న్ ఫైన‌ల్ అయిన‌ట్టేనా..కాదా..? అనే అంశంపై చిత్ర‌బృందం నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. మ‌రికొన్ని దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం క‌న్పిస్తోంది. అయితే ప్ర‌భాస్ కెరీర్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై సినీ ఇండ‌స్ట్రీల్లో భారీగా అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌భాస్ ఓ వైపు రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ చిత్రంతోపాటు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో మ‌రో మూవీని కూడా చేస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.