గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 15:46:24

దివ్య‌భార‌తిని రీప్లేస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు..

దివ్య‌భార‌తిని రీప్లేస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు..

త‌న అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది‌ అలనాటి అందాల తార దివ్య‌భారతి. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన దివ్య‌భార‌తి బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ సాజిద్ న‌దియావాలాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత‌  దివ్య‌భార‌తి ముంబైలోని త‌న అపార్టుమెంట్ బాల్క‌నీ లో నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తు  కింద ప‌డి ‌మృతి చెందింది.  దివ్య‌భార‌తి ఆక‌స్మిక మ‌ర‌ణం యావ‌త్ సినీ ప్ర‌పంచాన్ని దిగ్బ్రాంతికి లోను చేసిన విష‌యం తెలిసిందే. 

సాజిద్ న‌దియావాలా ఆ త‌ర్వాత వాద్రా న‌దియావాలాను పెళ్లి చేసుకున్నాడు. దివ్య‌భార‌తి మృతి అనంత‌రం సాజిద్, వాద్రాల జీవితం ఎలా ఉంద‌నే విష‌య‌మై..వాద్రా హిందీ సినీ మీడియాతో కొన్ని విషయాల‌ను పంచుకుంది. దివ్య‌భార‌తి మృతి చెందిన త‌ర్వాత తాను ఎదుర్కొన్న ప‌రిణామాల‌పై వాద్రా కొన్ని విష‌యాలు చెప్పింది. 

దివ్య‌భార‌తి మృతిపై జ‌నా లు కొన్ని సార్లు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు వేస్తుంటార‌ని నాకు తెలుసు. కానీ కొంద‌రు నన్ను ట్రోల్స్ చేస్తుంటార‌ని అనుకుంటుంటారు. దివ్య‌భార‌తి ఇప్పటికీ, ఎప్ప‌టికీ మా జీవితాల్లో ముఖ్య‌మైన వ్య‌క్తి. దివ్య కుటుంబం, ఆమె నాన్న‌, సోద‌రుడు కునాల్ మా కుటుంబ వ్య‌క్తుల్లా క‌లిసి ఉంటారు. మేం జ‌రుపుకునే ప్ర‌తీ వేడుక‌ల్లో దివ్య కుటుంబ‌స‌భ్యులు పాల్గొంటారు. కానీ కొంత‌మంది న‌న్ను విమ‌ర్శించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ ఆ ట్రోల్స్ నాకు వ‌ర్తించ‌వు. దివ్య‌భార‌తికి సంబంధించిన ప్ర‌తీ వార్షికోత్స‌వం, బ‌ర్త్ డేల్లో మేం పాల్గొనేవాళ్లం. నా పిల్ల‌లు దివ్య‌భార‌తి సినిమాలు చూస్తుంటారు. వాళ్లు దివ్య‌ను బ‌డీ మ‌మ్మీ అని పిలుచుకుంటారు. దివ్య‌భార‌తి చివ‌రిసారిగా వాడిన ఫ‌ర్ ఫ్యూమ్స్, హెయిర్ ప్రొడ‌క్ట్స్‌, ఇత‌ర వ‌స్తువులు నా భ‌ర్త సాజిద్ న‌దియావాలా ద‌గ్గ‌ర ఇప్ప‌టికీ భ‌ద్రంగా ఉన్నాయి. 

కాబ‌ట్టి నన్ను ట్రోల్స్ చేయాల‌నుకుంటున్న వాళ్ల‌కు ఒక్క‌టే మాట చెప్తున్నా. చాలా అంద‌మైన దివ్య‌భార‌తి..ఎప్ప‌టికీ మా జీవితాల్లో భాగ‌మైన వ్య‌క్తి అంటూ ..దివ్య‌భార‌తితో త‌న‌కున్న అనుబంధాన్ని, ఇత‌ర విషయాల‌ను పంచుకుంది వాద్రా న‌దియావాలా. logo