మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 29, 2020 , 09:04:19

అనారోగ్యానికి గురైన నోయ‌ల్‌.. టాస్క్ నుండి విశ్రాంతి

అనారోగ్యానికి గురైన నోయ‌ల్‌.. టాస్క్ నుండి విశ్రాంతి

ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా  బీబీ డేకేర్ అనే టాస్క్ ఆడుతున్న హౌజ్‌మేట్స్ ప్రేక్ష‌కుల‌కి చాలా విసుగు తెప్పించారు. పిల్ల‌లా మారి ర‌చ్చ రచ్చ చేయ‌డంతో ఇటు హౌజ్‌మేట్స్‌, ప్రేక్ష‌కులు చాలా బోరింగ్ ఫీల‌య్యారు. అమ్మ రాజ‌శేఖ‌ర్ ఛాక్లెట్స్ దొంగిలించిన హారిక అనంత‌రం లాస్య ప‌డుకున్నాక ఆమె చాక్లెట్స్‌ని కూడా దొంగిలించింది. పొద్దున త‌న చాక్లెట్స్  క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో అందిర ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఎంక్వైరీ చేసింది. రాత్రి హారిక తిర‌గ‌డం నేను చూశాను అన‌డంతో హారిక‌నే తీసి ఉంటుంద‌ని లాస్య డిసైడ్ అయింది. 

ఇక అరియానా చిన్న పిల్ల‌లా ఊరికే సోహైల్ మీద‌కు ఎక్క‌డం అత‌నికి ఇబ్బందిగా అనిపించింది. నా మీదే కాదు అప్పుడ‌ప్పుడు నేల మీద కూడా న‌డవాల‌ని అరియానాకు సూచించాడు సోహైల్. అనంతరం నాకు మ‌ట‌న్ కావాలి అంటూ మెహ‌బూబ్ .. సోహైల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అతిని చేయి కొరికాడు. దీంతో సోహైల్ త‌న బాధ‌ను కక్క‌లేక మింగ‌లేక కామ్ అయిపోయాడు. ఆ త‌ర్వాత మోనాల్ పిల్ల‌ల‌కు క్లాసులు చెప్తుండ‌గా, మెహ‌బూబ్, అవినాష్ లు ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు. 

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న నోయ‌ల్‌.. డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. మెడ న‌రాలు పట్టేశాయి, భుజాలు క‌ద‌ల‌నివ్వ‌డం లేద‌ని నోయ‌ల్ చెప్ప‌గా, అత‌ని డ్యూటీని అభిజిత్ తీసుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌తో స‌ర‌దాగా నేల‌, నీళ్లు, మంట ఆడించారు. ఈ టాస్క్‌లో అఖిల్ గెల‌వ‌డంతో మోనాల్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇక ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ పూర్తి కాగా, దీంట్లో విన్న‌ర్ జోడి ఎవ‌రో చెప్పాల‌ని బిగ్ బాస్ లాస్య‌నుకోరారు. దీంతో ఆమె   సోహైల్‌-అరియానా పేర్ల‌ను వెల్ల‌డించింది. దీంతో బిగ్‌బాస్ వారికి స్పెష‌ల్ గిఫ్టులు పంపారు. 

త‌న‌కు వ‌చ్చిన మ‌ట‌న్‌ను ఎవ‌రికి ఇవ్వ‌న‌ని సోహైల్ అంటున్న స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ దానిని దాచిపెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ఇది చూసిన సోహైల్ తీసుకునేందుకు రాగా, మాస్ట‌ర్ దానిని విసేరేశాడు. దీంతో కొన్ని పీసెస్ నేల పాలు అయ్యాయి. ఫుడ్‌తో ఆట‌లాడొద్దంటూ అఖిల్ వారిని హెచ్చరించాడు. ప్రోగ్రాం చివ‌ర‌లో చింపాంజీ బొమ్మ‌ను చూస్తుంటే త‌న ఇల్లు గుర్తొస్తుంద‌ని, త‌న‌కి ఆ బొమ్మ‌ని ఇచ్చేయాల‌ని కెమెరా ముందుకు వెళ్లి  ప్రాధేయ‌పడింది. అవినాష్ కూడా బిగ్ బాస్‌ని అడిగి ఇప్పిస్తాన‌ని అరియానాకు మాట ఇచ్చాడు. దీంతో 53వ ఎపిసోడ్ పూర్తైంది. 


logo