ఇటీవలి కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన రెండో పెళ్లి వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అప్పట్లో రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. తాను ఓ సమయంలో చేసుకుంటున్నట్టు కూడా తెలియజేసింది. కాని ఆ తర్వాత ఎలాంటి అప్‌ఢేట్ ఇవ్వలేదు. ఇక గత ఏడాది దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది మొదట్లో సింగర్ సునీత రెండో వివాహం చేసుకుంది. సురేఖా వాణి, హీరోయిన్ ప్రేమల రెండో పెళ్లికి సంబంధించి కూడా పలు కథనాలు వచ్చాయి. తాజాగా సింగర్, బిగ్ బాస్ ఫేం నోయల్ రెండో పెళ్లిపై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ర్యాప్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న నోయల్ హీరోయిన్ ఎస్తర్‌తో ప్రేమలో పడి, ఆమెను వివాహాం చేసుకున్నారు. పెళ్లి అయిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ వేరు పడ్డారు. అధికారికంగా మాత్రం గత ఏడాది విడిపోయారు. కోర్టు ఉత్తర్వులు రావడంతో ఈ ఇద్దరూ కూడా తమ విడాకుల విషయాన్ని బహిర్గత పరిచారు. ఇక తాజగా నోయల్ తన సోషల్ మీడియాలో ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అందరు నోయల్ తన రెండో పెళ్లికి సంబంధించిన వార్త చెబుతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.