మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 17:15:22

ఇక ఆర్మీ సినిమాలు తీయాలంటే ఎన్‌వోసీ త‌ప్పనిస‌రి..!

ఇక ఆర్మీ సినిమాలు తీయాలంటే ఎన్‌వోసీ త‌ప్పనిస‌రి..!

న్యూఢిల్లీ: దేశ‌భ‌క్తి ఇతివృత్తంతో ఇప్ప‌టికే ప‌లు భార‌తీయ భాష‌ల్లో చాలా సినిమాలు తెరకెక్కిన విష‌యం తెలిసిందే. ఇండియ‌న్ ఆర్మీలో జ‌రిగిన ప‌లు అంశాలు, ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాలు వ‌చ్చాయి. అయితే కొన్నిసార్లు సినిమాల్లో ఆర్మీ గురించి నెగెటివ్ గా చూపించార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డ సంద‌ర్భాలున్నాయి. అయితే దేశ‌ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చూసుకునే ఆర్మీపై ఇక‌పై ఎవ‌రు సినిమా తీయాల‌న్నా కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమ‌తి తీసుకోవాల్సిందే. స‌ద‌రు శాఖ నుంచి ద‌ర్శకుడు ఎన్‌వోసీ (నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్) ను తీసుకోవాలి.

స్క్రిప్ట్ చూపించిన త‌ర్వాత ర‌క్ష‌ణ శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఆర్మీ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన సినిమా లేదా వెబ్ సిరీస్ కానీ డాక్యుమెంట‌రీ కానీ విడుద‌ల చేసే ముందు ఎన్ వోసీ స‌ర్టిఫికెట్ ఉండాల‌ని పేర్కొంటూ..ర‌క్ష‌ణ శాఖ సీబీఎఫ్ సీకి ఓ లేఖ రాసింది. విడుద‌లకు ముందే లో ఆర్మీకి సంబంధించిన స‌న్నివేశాల‌ను చూపించాల‌ని ఇండియ‌న్ ఆర్మీ పేర్కొంది. అంతేకాదు ఎన్‌వోసీ లేని సినిమాల‌కు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo