గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 14:24:56

ప్ర‌భాస్ వెడ్డింగ్ ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా..?

ప్ర‌భాస్ వెడ్డింగ్ ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లిస్ట్ లో మొద‌ట‌గా వినిపించే పేరు ప్ర‌భాస్. ఈ యంగ్ రెబ‌ల్ స్టార్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్నాడ‌ని ప‌లుసార్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే ప్ర‌భాస్ పెళ్లి ఇప్ప‌ట్లో జ‌రిగ‌డం క‌ష్ట‌మేన‌నిపిస్తోంది. త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాల‌ని ప్ర‌భాస్ కుటుంబం, అభిమానులు కోరుకుంటుండ‌గా..ప్ర‌భాస్ మాత్రం వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నాడు. మ‌రోవైపు వ‌చ్చే రెండేళ్ల‌కు స‌రిప‌డా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అన్నీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలే కావ‌డంతో ప్ర‌భాస్ ఈ క్రేజీ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే వ‌ర‌కు పెళ్లి ఊసెత్త‌డం క‌ష్ట‌మే.

భ‌విష్య‌త్ లో పాన్ ఇండియా స్టార్ గా త‌న రేంజ్ ను మ‌రింత పెంచుకునేందుకు కేవ‌లం కెరీర్ పైనే ఫోక‌స్ పెడుతున్నాడు ప్ర‌భాస్‌. ప్ర‌భాస్ కు ప‌లువురు హీరోయిన్ల‌తో లింక‌ప్ పుకార్లు ‌వ‌చ్చినా..దీనిపై యంగ్ రెబ‌ల్ స్టార్ ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం బ్యాచిల‌ర్ లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్న ప్ర‌భాస్ సరైన స‌మ‌యంలో పెళ్లి నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇప్ప‌ట్లో ప్ర‌భాస్ పెళ్లి పీట‌లెక్కే అవ‌కాశాలు లేన‌ట్టేన‌నుకుంటున్నారు ఫ్యాన్స్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo