ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 20:45:44

నో టైమ్ టు డై.. బాండ్ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

నో టైమ్ టు డై.. బాండ్ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉండే క్రేజ్ మ‌నంద‌రికీ తెలిసిందే. దశాబ్దాలుగా జేమ్స్‌బాండ్ సిరీస్ చిత్రాలు సినీ ప్రేమికుల‌ను అల‌రిస్తున్నాయి. బాండ్ సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతుర‌త‌తో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా బాండ్ సీరీస్ లో వస్తున్న 25వ చిత్రం 'నో టైమ్ టు డై‌. బాండ్ పాత్రలో డేనియల్ క్రేగ్ నటించాడు. మూవీకి క్యారీ జోజీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను గురువారం విడుద‌ల చేశారు. నో టైమ్ టు డై మూవీ న‌వంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఒళ్లు గ‌గుర్పొడిచే సాహ‌సాలు, యాక్ష‌న్ స‌న్నివేశాలు ట్రైల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. logo