ఆదివారం 05 జూలై 2020
Cinema - Apr 18, 2020 , 09:56:49

టీజర్ రిలీజ్ ఆలోచ‌న లేదు: కేజీఎఫ్2 నిర్మాత‌

టీజర్ రిలీజ్ ఆలోచ‌న లేదు:  కేజీఎఫ్2 నిర్మాత‌

కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌లో యశ్‌ రాఖీభాయ్‌గా క‌నిపించారు. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా కేజీఎఫ్‌ రికార్డు కూడా సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర సీక్వెల్ రూపొంద‌స్తుండ‌గా, ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు

హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో రిలీజ్ అవుతుందని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.  అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం టీజ‌ర్ రిలీజ్ చేసే ప్ర‌ణాళిక‌లు ఏమి లేవ‌ని,  సినిమా రిలీజ్‌ ముందే ట్రైలర్ లాంచ్ అవుతుందని నిర్మాత కార్తీక్ గౌడ స్పష్టం చేశారు. చిత్రంలో సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా, రావు ర‌మేష్‌, రవీనాటండన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. సాయికొర్రపాటి తెలుగులో విడుదల చేయబోతున్నారు.  


logo