గురువారం 04 జూన్ 2020
Cinema - May 18, 2020 , 13:20:29

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని నిరాశ‌ప‌ర‌చిన ఆర్ఆర్ఆర్ టీం..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని నిరాశ‌ప‌ర‌చిన ఆర్ఆర్ఆర్ టీం..!

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ ఏడాది రిలీజ్ కావ‌ల‌సిన ఆర్ఆర్ఆర్ చిత్రం లాక్‌డౌన్ వ‌ల‌న జ‌న‌వరి 8న విడుద‌ల కానుంద‌ని కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. కాని ఆ రోజు కూడా సినిమా విడుద‌ల స‌స్పెన్స్‌గానే ఉంది. వ‌చ్చే ఏడాది సమ్మ‌ర్‌లో చిత్రం రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది.

రామ్‌చరణ్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి నెలలో విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇందులో ఎన్టీఆర్‌ను జలానికి, రామ్‌చరణ్‌ను అగ్నికి ప్రతీకలా చూపించారు. ఈ నెల 20న ఎన్టీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.కాని లాక్‌డౌన్ వ‌ల‌న ఎన్టీఆర్‌కి సంబంధించిన పోస్ట‌ర్ లేదా వీడియోని రూపొందించ‌లేక‌పోయాము.బ‌ర్త్‌డేకి ఏదో ఒక‌టి రిలీజ్ చేయ‌డం కంటే రానున్న రోజుల్లో అభిమానులు ఆశ్చ‌ర్యం పొందేలా మీ ముందుకు స‌ర్‌ప్రైజ్‌తో వ‌స్తాము. ఆ రోజు మ‌నంద‌రికి పెద్ద పండుగ‌లా ఇది ఉంటుంద‌ని ఆర్ఆర్ఆర్ టీం చెబుతుంది. 


logo