గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 10:56:49

నాగార్జున ఇచ్చిన ట్విస్ట్‌తో బిత్త‌ర‌పోయిన హౌజ్‌మేట్స్

నాగార్జున ఇచ్చిన ట్విస్ట్‌తో బిత్త‌ర‌పోయిన హౌజ్‌మేట్స్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 స‌క్సెస్‌ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం మంచి రేటింగ్‌తో దూసుకెళుతున్న ఈ షో నుండి ఇప్ప‌టికే సూర్య కిర‌ణ్, క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. ఇక వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇచ్చిన  కుమార్ సాయి, జ‌బ‌ర్ధ‌స్త్  అవినాష్‌ల‌తో క‌లిపి ప్ర‌స్తుతం హౌజ్ లో 16 మంది స‌భ్యులు ఉన్నారు. అయితే శ‌నివారం రోజు నాగార్జున.. ఈ సారి డ‌బుల్ ఎలిమినేష‌న్ అంటూ అంద‌రి గుండెల్లో రైళ్ళు ప‌రిగిత్తేలా చేశారు.

శ‌నివారం రోజు క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ అయింద‌ని ప్ర‌క‌టించిన నాగ్, ఆదివారం రోజు ఎవ‌రిని హౌజ్ నుండి బ‌య‌ట‌కు పంపిస్తారా అని ఇటు ప్రేక్ష‌కులు, అటు హౌజ్‌మేట్స్ ఎంతో టెన్ష‌న్‌తో ఎదురు చూశారు. అయితే అనేక ప‌రిణామాల మ‌ధ్య‌ దేత్త‌డి హారిక ఎలిమినేట్ అయింద‌ని నాగ్ ప్ర‌క‌టించ‌డంతో అంద‌రు త‌మ క‌న్నీటి కుళాయిలు తిప్పారు. హారిక‌ని సాగ‌నంపేందుకు  గేట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన త‌ర్వాత నాగార్జున మ‌రో ట్విట్ట్ ఇచ్చారు. దీంతో ప్ర‌తి ఒక్క‌రిలో ఆనందం వెల్లివెరిసింది.

డాగ్ అండ్ బోన్ గేమ్ పూర్తయిన తరువాత ఎలిమినేష‌న్‌లో చివ‌రిగా మోనాల్ గుజ్జార్ , హారిక‌లు మాత్ర‌మే మిగిలినట్టు నాగార్జున తెలిపారు. అయితే వీరిద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్ కానున్నార‌ని, వారిని ఎలిమినేట్ చేసేది ప్రేక్ష‌కులు కాదు, ఎలిమినేష‌న్ నుండి సేవ్ అయిన హౌజ్ మేట్స్ అంటూ నాగ్ పేర్కొన్నారు. అయితే ఈ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా  ఒక్కొక్కరికీ ఒక్కో గాజు బీకర్ ఇచ్చి,  బ్లూ, గ్రీన్ కలర్ రంగు నీళ్ళ‌తో ఉన్న గ్లాసుల‌ని ప‌క్క‌న పెట్టారు. 

బ్లూ క‌ల‌ర్ ద‌గ్గ‌ర హారిక నిలుచోగా, గ్రీన్ క‌ల‌ర్ ద‌గ్గ‌ర మోనాల్ నిలుచుంది. వీరిద్ద‌రిలో ఒక‌రిని ఎలిమినేట్ చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా ఎలిమినేష‌న్‌లో లేని ఏడుగురు స‌భ్యులు అఖిల్, మెహబూబ్, సుజాత, దేవి, లాస్య, అరియానా, దివిలు టాస్క్ మొద‌లు పెట్టారు. త‌ము ఎవ‌రినైతే బ‌య‌ట‌కు పంపాల‌నుకుంటున్నారో వారి బీక‌ర్‌లో రంగు నీళ్ళు పోసి కార‌ణం చెప్పాలి. చివ‌రికి ఏ బీకర్‌లో నీళ్లు ఎక్కువగా ఉంటే ఆ హౌజ్‌మేట్ ఎలిమినేట్ అయిన‌ట్టు.  ఈ క్ర‌మంలో హారిక బీక‌ర్‌లో ఎక్కువ రంగు నీళ్ళు ఉండ‌డంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు నాగ్.

హారిక ఎలిమినేట్ అయింద‌న‌గానే అంద‌రు తెగ ఏడ్చేశారు. ఆమె ల‌గేజ్ అంతా స‌ర్ధేసి గేట్ వ‌ర‌కు పంపారు. అంత‌లోనే నాగార్జున అంద‌రిని లివింగ్ రూంలోకి ర‌మ్మ‌ని చెప్ప‌డంతో  అభిజిత్, నోయల్.. హారికను  ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు. సెల్ఫ్ నామినేష‌న్ చేసుకున్నందుకే హారిక‌కి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చామ‌ని, ఇదొక హెచ్చ‌రిక లాంటిద‌ని నాగ్ తెలిపారు. మొత్తానికి నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ తో అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయి. 


logo