సోమవారం 01 జూన్ 2020
Cinema - May 18, 2020 , 07:49:26

ఇక రొమాంటిక్ సీన్లు ఉండవేమో..

ఇక రొమాంటిక్ సీన్లు ఉండవేమో..

తెలుగులో ఇప్పుడిప్పుడే రొమాంటిక్‌ సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. సినిమాలో యాక్షన్‌, కామెడీ, ట్రాజడీలతో పాటు శృంగార సన్నివేశాలు కూడా చాలా కీలకమైనవనే చెప్పాలి. నిర్మాతలకు కోట్లు సంపాదించిపెట్టడంలో ఈ సీన్లు ఎంతో కీలక పాత్ర పోశిస్తాయి. తెలుగులో రొమాంటిక్‌  సీన్లతో అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌100 వంటి అనేక సినిమాలు అనుకోని విజయాలను సాదించాయి. ఈ మద్య కాలంలో యూత్‌ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా లిప్‌లాక్‌, మరింత ఘాటు శృంగార స్ననివేశాలను కూడా చూసేస్తున్నారు. వాటిని సినిమాలో మంచి వినోదంగా భావిస్తున్నారు. 

అయితే త్వరలో సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశముంది. కానీ వాటిల్లో ఈ రకమైన శృంగార సన్నివేశాలు ఉండకపోవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం మార్గనిర్ధేశకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా సినిమాల్లో నటులు అత్యంత సన్నిహితంగా మెదిలేందుకు అవకాశం లేనట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఈ మద్యనే నియమాల విషయంలో 20 దేశాలకు చెందిన సినీ ప్రముఖులు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా దేశంలో జరిగే విదేశీ చిత్రాల షూటింగ్‌లకు, విదేశాల్లో జరిగే మన షూటింగ్‌లకు నియమ నిబందనలను గురించి చర్చలు జరిపారు. 


logo