శుక్రవారం 29 మే 2020
Cinema - Apr 10, 2020 , 18:53:38

స‌ల్మాన్ సినిమా ఈద్ కు లేన‌ట్టేనా..?

స‌ల్మాన్ సినిమా ఈద్ కు లేన‌ట్టేనా..?

బాలీవుడ్ యాక్ట‌ర్ స‌ల్మాన్ ఖాన్ ద‌బాంగ్ 3 చిత్రం తర్వాత రాధే ప్రాజెక్టులో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌తీ ఏడాది ఈద్ కానుక‌గా కొత్త సినిమాతో ప్రేక్ష‌కులను ప‌లుక‌రించే స‌ల్లూభాయ్‌..ఈ సారి మాత్రం బ్రేక్ ఇవ్వ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కు రెండు పాట‌లు షూటింగ్ పూర్తి చేసుకోవ‌డం, ఎడిటింగ్ ప‌నుల‌తోపాటు ఇత‌ర ప్యాచ్ వ‌ర్క్స్ పెండింగ్ లో ఉండ‌టం, చివ‌రి ద‌శ‌లో షూటింగ్ నిలిచిపోవ‌డం వంటి కార‌ణాలతో సినిమా విడుద‌ల ఆల‌స్యం కానుంద‌ని బాలీవుడ్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాధే సినిమాలో స‌ల్మాన్ స‌ర‌స‌న దిశా ప‌టానీ మ‌రోసారి న‌టిస్తోంది. గతేడాది న‌వంబ‌ర్ లో రాధే సినిమా షూటింగ్ షురూ అయింది. ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడు.     


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo