సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 12:52:53

నో ఓటీటీ..థియేటర్లలో మాత్రమే..!

నో ఓటీటీ..థియేటర్లలో మాత్రమే..!

టాలీవుడ్ యాక్టర్లు రానా-సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాకు సంబంధించిన సగభాగం షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ తో షూట్ కు బ్రేక్ పడింది. త్వరలోనే మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది రానా అండ్ టీం. కరోనా మహమ్మారి  నేపథ్యంలో థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే నిర్మాతలు ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ  సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా వ‌స్తోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి కామ్రేడ్ భార‌త‌క్క రోల్ లో క‌నిపించ‌నుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo