గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 11:08:35

సుశాంత్ శ‌రీరంలో విషం ఆన‌వాళ్ళు క‌నిపించ‌లేదు...

సుశాంత్ శ‌రీరంలో విషం ఆన‌వాళ్ళు క‌నిపించ‌లేదు...

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.  ఆయ‌న మ‌ర‌ణం అనేక అనుమానాల‌కు తావిస్తుంది. సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య కాదు, హ‌త్యే అని కొంద‌రు ఆరోపిస్తున్న క్ర‌మంలో ఈ కేసుని సీబీఐ ద‌ర్యాప్తు చేస్తుంది.. సుశాంత్ వృత్తిప‌ర‌మైన అంశాల‌తో పాటు, వేరే అంశాల‌కు సంబంధించి సీబీఐ లోతుగా ద‌ర్యాప్తు చేస్తుంది.

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టం మరియు విసెరా నివేదికలను ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బృందం తిరిగి విశ్లేషించింది . సుశాంత్‌ అనుమానాస్పద మృతికి సంబంధించి సుదీర్ఘ విశ్లేష‌ణ‌ల త‌ర్వాత ఎయిమ్స్ ప్యానెల్  తమ‌ నివేదికను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు సమర్పించింది. ఈ నివేదిక ప్ర‌కారం సుశాంత్ శరీరంలో సేంద్రీయ విషం ఆన‌వాళ్ళు లేవని,  కూపర్ హాస్పిటల్ యొక్క నివేదికను కూడా ఎయిమ్స్ విశ్లేషిస్తుందని పేర్కొంది. సుశాంత్‌ డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నారు


logo