శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 19:56:17

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

అసలే 10 నెలల గ్యాప్ వచ్చింది..థియేటర్స్ కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్నాయి..ప్రేక్షకులు స్క్రీన్స్ వైపు అడుగులేస్తున్నారు. అందుకే వరసగా సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా సినిమాలన్నీ ఇప్పట్నుంచి రిలీజ్ అవుతాయి అనుకున్నారు అభిమానులు. కానీ ఊహించినట్లు కాకుండా వేరేలా జరుగుతుందిప్పుడు. సంక్రాంతి సినిమాలు వచ్చిన తర్వాత ఈ వారం ఖాళీగా వెళ్లిపోతుంది. ఇప్పటికీ పండగ సినిమాలే థియేటర్స్‌లో దర్శనమిస్తున్నాయి. మాస్టర్, క్రాక్, రెడ్ సినిమాలకు మంచి వసూళ్లు వస్తున్నాయి. వీటిలో ఇప్పటికే రవితేజ క్రాక్ బ్లాక్‌బస్టర్ కాగా.. విజయ్ మాస్టర్ సూపర్ హిట్ అయింది. మరోవైపు రామ్ పోతినేని రెడ్ సినిమా కూడా నేడో రేపో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది. 

దాంతో పండగ సినిమాలకు సెలవులు బాగానే కలిసొచ్చాయి. దాంతో పాటు కరోనా భయం కూడా ప్రేక్షకుల్లో ఇప్పుడు కనిపించడం లేదు. మంచి సినిమా వస్తే కచ్చితంగా థియేటర్ వరకు వస్తామని నిరూపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జనవరి 22 శుక్రవారం కూడా సినిమాలు విడుదల అవుతాయని అనుకున్నారంతా. కానీ ఒక్కటి కూడా ఈ వారం విడుదల కావడం లేదు. శనివారం అంటే జనవరి 23న అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు విడుదలవుతుంది. కానీ ఈ సినిమాపై ఎవరికీ నమ్మకాలు లేవు..అంచనాలు కూడా లేవు. నిజం చెప్పాలంటే నరేష్ కూడా ఈ చిత్రంపై పెద్దగా నమ్మకం పెట్టుకున్నట్లు అయితే కనిపించడం లేదు. ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు నాందీ సినిమాపైనే ఉంది. 

ఇదిలా ఉంటే అల్లరి నరేష్ కాకుండా ఈ వారం మరే సినిమా రావడం లేదు. సుమంత్ నటించిన కపటదారి ట్రైలర్ బాగానే ఉంది. ఆ సినిమా అయినా ఈ వారం వచ్చుంటే బాగుండు అని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే జనవరి 29 నుంచి మాత్రం వరస సినిమాలున్నాయి. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, సుమంత్ కపటదారి 29న వస్తుంటే.. ఫిబ్రవరి 5న ఉప్పెన విడుదల అవుతుంది. అలా సమ్మర్ వరకు కూడా ఆగకుండా సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. కానీ జనవరి 22 శుక్రవారం మాత్రం వదిలేసారు. బహుశా సంక్రాంతి సినిమాలకు మరో వారం ఇవ్వాలని నిర్మాతలు కానీ నిర్ణయించుకున్నారేమో మరి..?

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo