బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 16:42:54

ఈ ఆదివారం నో ఫ్యాన్స్..బిగ్ బీ బంగ్లా ఏరియా నిర్మానుష్యం

ఈ ఆదివారం నో ఫ్యాన్స్..బిగ్ బీ బంగ్లా ఏరియా నిర్మానుష్యం

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ్యామిలీలో కరోనా క‌లక‌లం రేపిన విష‌యం తెలిసిందే. బిగ్ బీతోపాటు అభిషేక్, ఐశ్వ‌ర్యారాయ్, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డ్డారు. అమితాబ్, అభిషేక్ నానావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతుండగా..ఐష్ ,ఆరాధ్య ఇంట్లో చికిత్స‌నందిస్తున్నారు వైద్యులు. ఈ నేప‌థ్యంలో ముంబైలోని అమితాబ్‌, జ‌ల్సా, ప్ర‌తిక్ష‌, వ‌ట్సా, జ‌న‌క్ బంగ్లాల‌ను బీఎంసీ అధికారులు కంటైన్ మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించారు. దీంతో ఎప్పుడూ సంద‌డి ఉండే అమితాబ్ ఇంటి ప‌రిస‌రాలు బోసిబోయాయి. 

అమితాబ్ బ‌చ్చ‌న్ త‌ర‌చూ త‌న అభిమానుల‌తో ఇంటి బ‌య‌ట క‌లుస్తార‌నే విషయం తెలిసిందే. బిగ్ బీ ప్ర‌తీ ఆదివారం త‌న‌ను చూసేందుకు వ‌చ్చిన అభిమానుల‌కు అభివాదం చేస్తుంటారు. వారితో మాట్లాడుతుంటారు. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ ఆదివారం బిగ్ బీ బంగ్లా ఉన్న ఏరియా నిర్మానుష్యంగా మారిపోయింది. ప్ర‌స్తుతం ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిన ప‌రిస్థితి. బ‌హుశా బిగ్ బీ కెరీర్ లో ఈ ఆదివారం మ‌రిచిపోలేని రోజు అయి ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదేమో. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన బిగ్ బీ సుర‌క్షితంగా మ‌ళ్లీ అంతే ఎన‌ర్జీతో అభిమానుల‌కు అభివాదం చేస్తార‌ని కోరుకుందాం. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo