గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 13:46:27

డ్ర‌గ్స్ పార్టీ ఇవ్వ‌లేదు : క‌ర‌ణ్ జోహార్‌

డ్ర‌గ్స్ పార్టీ ఇవ్వ‌లేదు : క‌ర‌ణ్ జోహార్‌

హైద‌రాబాద్‌:  ఫిల్మ్‌మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఇంట్లో జ‌రిగిన పార్టీలో బాలీవుడ్ సెల‌బ్రిటీలు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్ జోహార్ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు.  మీడియా వార్త‌లను ఆయ‌న ఖండిస్తూ.. త‌న ఇంట్లో జ‌రిగిన పార్టీలో ఎవ‌రూ మాద‌క ద్ర‌వ్యాలు తీసుకోలేద‌న్నారు. ఆ వార్త‌లు నిరాధార‌మైన‌వ‌ని, త‌ప్పుడు వార్త‌లు అని ఖండించారు. తానెప్పుడు డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని, మ‌రో వ్య‌క్తి కూడా డ్ర‌గ్స్ తీసుకునే విధంగా ప్రోత్స‌హించ‌లేద‌ని క‌ర‌ణ్ తెలిపారు.  క‌ర‌ణ్ ఇంట్లో గ‌తంలో జ‌రిగిన పార్టీకి సంబంధించిన ఓ వీడియో ఇటీవ‌ల వైర‌ల్ అయ్యింది. ఆ పార్టీకి సాహిద్ క‌పూర్, దీపిక‌, ర‌ణ్‌బీర్‌, వ‌రున్ ధావ‌న్‌, అర్జున్ క‌పూర్‌, మ‌లైకా అరోరా, విక్కీ కౌశ‌ల్ హాజ‌ర‌య్యారు. ఆ పార్టీకి వ‌చ్చిన సెల‌బ్రిటీలంతా డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో క‌ర‌ణ్ జోహార్‌కు ఎన్సీబీ స‌మ‌న్లు ఇవ్వ‌నున్న‌ట్లు ఇటీవ‌ల సిరోమ‌ని అకాలీద‌ళ్ నేత మ‌న్‌జింద్ సింగ్ సిర్‌సా పేర్కొన్నారు. 


logo