ముంబై: నీలి చిత్రాల కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతని బ్యాంక్ అకౌంట్లకు చెందిన లావాదేవీలపై ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్లను పోలీసులు నియమించారు. ఈ కేసులో బాలీవుడ్ నటి, కుంద్రా భార్య శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ పేరిట ఉన్న ఓ జాయింట్ అకౌంట్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వియాన్ పరిశ్రమే పోర్న్ రాకెట్లో కీలకంగా మారింది. ఆ కంపెనీలో శిల్పా శెట్టి డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. కుంద్రాకు చెందిన కొన్ని బ్యాంక్ అకౌంట్లలో విదేశాల నుంచి డబ్బులు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. అయితే శిల్పాశెట్టి అకౌంట్లోకి మాత్రం డబ్బులు వచ్చినట్లు ఇప్పటి వరకు గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని, ఇప్పుడే శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇవ్వలేమని ఓ అధికారి తెలిపారు. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కుంద్రా అకౌంట్లోకి 1.17 కోట్లు వచ్చినట్లు ఆడిటర్స్ గుర్తించారు.