గురువారం 02 జూలై 2020
Cinema - Apr 04, 2020 , 14:46:31

టాలీవుడ్ కాంబినేష‌న్స్‌లో నిజ‌మెంత ?

టాలీవుడ్ కాంబినేష‌న్స్‌లో నిజ‌మెంత ?

లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేట‌ర్స్‌లో బొమ్మ ప‌డ‌డం ఆగింది. సినీ కార్మికులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. క‌రోనా రోజురోజుకి విజృంభిస్తుండ‌డంతో్ షూటింగ్స్ ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలియ‌ని ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ,  సినిమాల‌కి సంబంధించిన కొన్ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వాటిని ప‌రిశీలిస్తే..

ర‌చ‌యిత నుండి డైరెక్ట‌ర్‌గా మారిన కొర‌టాల శివ  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల చేయబోయే సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుంద‌ని టాక్. 2021లో ఈ చిత్రం మొదలవనుందని ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కథ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 

ఇక త్రివిక్ర‌మ్- చిరు కాంబినేష‌న్ లో సినిమా రానుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ కి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడని, ఆ లైన్ మీద త్రివిక్రమ్ ఆల్ రెడీ కొంత వర్క్ చేశాడని.. రానున్న రెండు సంవత్సరాలలో ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందనే వార్త, ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీనిలో ఎంత క్లారిటీ ఉంద‌నేది తెలియాల్సి ఉంది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo