శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 14, 2020 , 10:07:02

అవ‌తార్ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు..!

అవ‌తార్ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు..!

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవ‌తార్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.2009లో వచ్చిన ‘అవతార్‌’ సినిమాకు ప్ర‌స్తుతం రెండు మూడు సీక్వెల్స్‌ సిద్ధం చేస్తున్నారు కామెరూన్‌. అయితే కరోనా వ‌ల‌న అవ‌తార్ 2 చిత్రం వాయిదా ప‌డ‌నున్న‌ట్టు కొద్ది రోజుల క్రితం జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు కామెరూన్

దాదాపు 250 మిలియన భారీ  వ్యయంతో సైన్స్‌ఫిక్షన్‌గా రూపొందిస్తున్న అవ‌తార్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ 17న‌ విడుదల చేసేందుకు  హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ ముందుగా ప్లాన్ చేశాడు. అయితే క‌రోనా వ‌ల‌న త‌మ ప్లాన్స్ అన్నీ పూర్తిగా తారుమారు అయ్యాయ‌ని, అయిన‌ప్ప‌టికీ చెప్పిన స‌మ‌యానికి సినిమాని విడుద‌ల చేస్తామ‌నే న‌మ్మ‌కం ఉంది అని కామెరూన్ స్ప‌ష్టం చేశారు


logo