శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 01, 2020 , 08:57:06

బ‌ర్త్‌డే వేడుక‌లకి దూరం..నో స‌ర్‌ప్రైజ్ అంటున్న అజిత్

బ‌ర్త్‌డే వేడుక‌లకి దూరం..నో స‌ర్‌ప్రైజ్ అంటున్న అజిత్

త‌ల అజిత్ ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ హీరోల‌లో ఒక‌రు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ ఈ రోజు 49వ ప‌డిలోకి అడుగుపెట్టారు. అజిత్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు సోష‌ల్ మీడియాలో శుభ‌కాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. మ‌రోవైపు అజిత్ న‌టిస్తున్న వ‌లిమై చిత్రానికి సంబంధించి ఏదో ఒక స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని ఆశిస్తున్నారు.

క‌రోనా సంక్షోభం వ‌ల‌న అజిత్ త‌న బ‌ర్త్‌డే వేడుక‌లకి దూరంగా ఉంటున్నారు. అలానే అభిమానులని కూడా వేడుక‌లు జ‌రుపొద్ద‌ని కోరారు. ఇక హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో అజిత్ హీరోగా తెర‌కెక్కుతున్న వ‌లిమై చిత్ర ఫ‌స్ట్ లుక్ లేదా టీజ‌ర్ వ‌స్తుంద‌నుకున్న అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు నిర్మాత బోనీ క‌పూర్. ప్ర‌జ‌లంద‌రు ఇబ్బంది ప‌డుతున్న ఈ స‌మ‌యంలో చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌మ‌ని పేర్కొన్నారు. అజిత్ స‌ర‌స‌న హ్యుమా ఖురేషీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల‌న వ‌లిమి చిత్ర చివ‌రి షెడ్యూల్ ఆగిన‌ట్టు తెలుస్తుంది. 


logo