బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 23:35:51

ఆ వార్తల్లో నిజం లేదు

ఆ వార్తల్లో నిజం లేదు

కథాంశాల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తుంది మలయాళీ సోయగం నివేదా థామస్‌. కెరీర్‌ ఆరంభం నుంచి అభినయప్రధాన పాత్రల్ని ఎంచుకుంటూ  తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి పరిపూర్ణంగా న్యాయం చేస్తుందని ఈ సొగసరికి పేరుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘వి’ ‘వకీల్‌సాబ్‌' వంటి భారీ సినిమాల్లో నటిస్తోంది. ఇదిలావుండగా అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘పుష్ప’ సినిమాలో నివేదా థామస్‌ అల్లు అర్జున్‌ ప్రియురాలి పాత్రలో నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో వాస్తవం లేదని తెలిసింది. ‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కథానుగుణంగా ఆ సినిమాలో మరో నాయికకు చోటులేదని చెబుతున్నారు. గత ఏడాది తెలుగులో ‘118’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాల్లో చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని అలరించింది నివేదా థామస్‌. తెలుగులో సుధీర్‌వర్మ దర్శకత్వంలో నివేదా థామస్‌ ఓ సినిమాలో నటించనుంది.logo