ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 09:22:41

గంజాయి కూడా తులసి మొక్కలాంటిదే.. : హీరోయిన్

గంజాయి కూడా తులసి మొక్కలాంటిదే.. :  హీరోయిన్

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం సినీ ప‌రిశ్ర‌మ‌ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు శాండ‌ల్‌వుడ్‌లోను డ్ర‌గ్స్ మాఫియా న‌డుస్తుంద‌ని, దీనితో ప‌లువురికి లింకులు ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో లోతుగా ద‌ర్యాప్తు జ‌రుగుతుంది. హిందీలో రియాని విచారిస్తుండ‌గా, క‌న్న‌డ‌లో రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసి ఆమె నుండి కీల‌క స‌మాచారం రాబ‌డుతున్నారు. అయితే రాగిణి ద్వివేదికి మ‌ద్ద‌తు ఇస్తూ క‌న్న‌డ న‌టి నివేదిత చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి. 

గంజాయిని మ‌న‌దేశంలో చ‌ట్ట బ‌ద్దం చేయాలి. గంజాయి తుల‌సి మొక్క‌లాంటిదే. గంజాయిని బ్యాన్ చేయడానికి ముందు అది ఆయుర్వేదానికి వెన్నెముకలా ఉండేదని పేర్కొంది. ప‌విత్ర‌మైన తుల‌సిని గంజాయితో పోల్చ‌డంతో నివేదిత‌ని సోష‌ల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. నీకు గంజాయి అల‌వాటుందా, అందుకే ఇలాంటి మాట‌లు మాట్లాడుతున్నావా అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 


logo