శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 21:44:55

నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..

నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..

భీష్మ సినిమా విజయంతో నితిన్‌లో ఎక్కడ లేని జోష్ వచ్చింది. అంతకు ముందు కొన్ని సినిమాలు నిరాశ పరిచినా.. ఒక్క సినిమాతో అన్నీ ఓవర్ కమ్ చేసాడు ఈ యంగ్ హీరో. వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా గతేడాది లాక్ డౌన్ కు సరిగ్గా 15 రోజుల ముందు విడుదలైంది. సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో రెండు వారాల్లోనే 30 కోట్ల షేర్ వసూలు చేసి నితిన్ కోరుకున్న విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాత ఒకేసారి నాలుగు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు నితిన్. అందులో రెండు సినిమాలు కేవలం నెలరోజుల వ్యవధిలో విడుదలకు సిద్ధమయ్యాయి. 

ప్రస్తుతం చంద్రశేఖర్ ఏలేటి, వెంకీ అట్లూరి, మేర్లపాక గాంధీ లాంటి టాలెంటెడ్ దర్శకులతో పని చేస్తున్నాడు. ఇందులో సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చెక్ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు దర్శక నిర్మాతలు. ఒక ఉరిశిక్ష పడిన ఖైదీ చదరంగం ఆటలో అత్యంత నిష్ణాతుడు అయితే ఆ తరువాత జరిగే పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో చెక్ సినిమా తెరకెక్కిస్తున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.

మనమంతా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ దర్శకుడు చెక్ తో కచ్చితంగా కమర్షియల్ విజయం అందుకుంటానని ధీమాగా కనిపిస్తున్నాడు. మరోవైపు మార్చి 26న వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మిస్టర్ మజ్ను ఫ్లాప్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రంగ్ దే వస్తుంది.

ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటితో నితిన్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. వీటితో పాటు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అందధూన్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

సూర్య‌-బోయ‌పాటి కాంబోలో సినిమా..!

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo