మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 16:39:28

ఢిల్లీలో తెలుగు న‌టిని ఫాలో అవుతున్న వ్య‌క్తి అరెస్ట్

ఢిల్లీలో తెలుగు న‌టిని ఫాలో అవుతున్న వ్య‌క్తి అరెస్ట్

తెలుగు న‌టిని ఫాలో అవుతున్న వ్య‌క్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నితిన్ గాంగ్వ‌ర్ (26) రెండేళ్లుగా త‌న‌ను ఫాలో అవుతున్న‌ట్టు రోహిణీ సెక్టార్ లో నివ‌సించే స‌ద‌రు న‌టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. న‌టి ఫిర్యాదు మేర‌కు నితిన్ గాంగ్వ‌ర్ ను శుక్ర‌వారం అరెస్ట్ చేశామ‌ని డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ పీకే మిశ్రా తెలిపారు. నితిన్ గాంగ్వ‌ర్ త‌న‌ను ఫాలో అవుతుండ‌టంతో ఆ న‌టి సోష‌ల్ మీడియాలో అత‌ని పేరును బ్లాక్ చేసింది. అయినా నిందితుడు న‌కిలీ ఐడీ క్రియేట్ చేసి న‌టి నంబ‌ర్ కు తుపాకీ ఫొటోను పంపించి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు.

న‌టి ఢిల్లీలో ఉంటుందా..? లేదా అనే విషయం తెలుకోవ‌డానికి నిందితుడు ఆమె ఇంటికి కూడా వెళ్లాడు. దీంతో ఆమె ఢిల్లీ నుంచి ముంబైకి వ‌చ్చింది. న‌టి వృత్తిరీత్యా ముంబై, హైద‌రాబాద్ మ‌ధ్య త‌న ప్ర‌యాణం సాగిస్తుంటుంది. అయితే ఆమె కుటుంబం ఢిల్లీలోనే ఉంటోంది. నిందితుడిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని పీకే మిశ్రా వెల్ల‌డించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo