థియేటర్లో ఫ్లాప్ అయినంత మాత్రాన కొన్ని సినిమాలను మరీ తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే అవి టీవీలో మంచి విజయం సాధిస్తున్నాయి. మహేశ్ బాబు నటించిన అతడు, ఖలేజా అదే కోవకు చెందిన సినిమాలు. దాంతో పాటు ఇంకా చాలా సినిమాలు కూడా థియేటర్లో ఫ్లాప్ అయినా టీవీలో మాత్రం బంపర్ హిట్ అవుతుంటాయి. ఇప్పుడు నితిన్ నటించిన ఒక సినిమా కూడా ఇలాగే రికార్డు రేటింగ్ వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ తొలిసారి హీరోగా నటించిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైంది. ప్రతిసారి ఏలేటి సినిమాలకు కచ్చితంగా విమర్శకుల ప్రశంసలు దక్కేవి. కానీ సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.
ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అత్యంత దారుణంగా నిరాశ పరిచింది. కేవలం రూ.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. గతవారం ఈ సినిమాను టీవీలో ప్రసారం చేశారు. థియేటర్లోనే డిజాస్టర్ అయ్యింది.. ఇక టీవీలో ఎవరు చూస్తారులే అనుకున్నారంతా. కానీ ఊహించని విధంగా ఈ సినిమాకు 8.9 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దీనికంటే ముందు నితిన్ నటించిన రంగ్ దే సినిమాకు కేవలం 7.2 రేటింగ్ మాత్రమే వచ్చింది. నిజానికి చెక్ సినిమా కంటే రంగ్ దే వసూళ్ల పరంగా కూడా చాలా ముందు ఉంది. కానీ దాని కంటే ఈ సినిమా రేటింగ్‌లో ముందుంది. గతంలో బాలకృష్ణ నటించిన ఒక్కమగాడు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. థియేటర్లో అత్యంత దారుణంగా నిరాశ పరిచిన ఈ సినిమా టీవీలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా మంచి రేటింగ్ సంపాదించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?