బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 00:17:32

గాయని ‘గమనం’

గాయని ‘గమనం’

శ్రియ కథానాయికగా నటించిన చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకురాలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో నిత్యామీనన్‌ కీలక పాత్రలో నటించింది. ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం హీరో శర్వానంద్‌ విడుదల చేశారు. దర్శకురాలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమాలో నిత్యామీనన్‌ గాయని శైలపుత్రీ దేవి అనే ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. అందం, దైవత్వం కలబోతగా ఆమె పాత్ర మెప్పిస్తుంది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇళయరాజా సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. ‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని నిర్మాతలు రమేష్‌, వెంకీ, జ్ఞానశేఖర్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌, సంగీతం: ఇళయరాజ,  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజనా రావు.
logo