స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో సి.హెచ్.సత్య సుమన్‌బాబు హీరోగా నటిస్తున్న ‘నిత్య కల్యాణం పచ్చ తోరణం’ చిత్ర స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఇటీవల జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ నెల 25న నెల్లూరులో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ మొదలవుతుంది. అనంతరం అరకు, బెంగళూరులో జరిపే షెడ్యూల్స్‌తో సినిమాను పూర్తిచేస్తాం. ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. వైవిధ్యమైన ఇతివృత్తంతో కుటుంబ కథగా తెరకెక్కించబోతున్నాం’ అన్నారు. సుమన్, షాయాజీషిండే, చలపతి, నరేష్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అడపా సతీష్, సంగీతం: ప్రమోద్, మాటలు: రామకృష్ణ, నిర్మాత, దర్శకత్వం: సి.హెచ్.సత్య సుమన్‌బాబు.