సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 11:01:24

ఫ‌ల‌క్‌నుమాలోమ‌రో సెల‌బ్రిటీ వివాహం..!

ఫ‌ల‌క్‌నుమాలోమ‌రో సెల‌బ్రిటీ వివాహం..!

టాలీవుడ్‌లో పెళ్ళిళ్ళ‌ హంగామా మొద‌లైంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో హీరో నిఖిల్‌, నిర్మాత దిల్ రాజు పెళ్లి పీట‌లెక్క‌గా మ‌రికొద్ది రోజుల‌లో ద‌గ్గుబాటి రానా, హీరో నితిన్ ఓ ఇంటి వారు కాబోతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న నితిన్ ఈ నెల 26న ప్రియురాలు శాలిని మెడలో నితిన్‌ మూడుముళ్లు వేయ‌నున్నాడు. హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమాలో వీరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక నిరాడంబరంగా జరుగనున్నట్లు సమాచారం. 

ఏప్రిల్ 16న దుబాయ్‌లో డిస్టినేషన్‌ వెడ్డింగ్‌ను జరుపుకోవాలని నితిన్ ప్లాన్ చేయ‌గా,  కరోనా వైరస్‌ వ్యాప్తితో పెళ్లి వాయిదాపడిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆగ‌స్ట్ 8న రానా, మిహికాల వివాహం ఫ‌ల‌క్‌నుమాలో జ‌ర‌గ‌నుంద‌ని ఇటీవ‌ల సురేష్ బాబు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo