సోమవారం 01 జూన్ 2020
Cinema - May 04, 2020 , 15:58:39

హంద్వారా అమ‌రులకి సెల్యూట్ చేసిన నితిన్‌, సాయి తేజ్‌

హంద్వారా అమ‌రులకి సెల్యూట్ చేసిన నితిన్‌, సాయి తేజ్‌

ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న‌ప్ప‌టికీ  జమ్ము కశ్మీర్ హంద్వారాలో ఉగ్రవాదుల కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హంద్వార్‌లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో భారత సైన్యంకు చెందిన కల్నల్.. మేజర్.. ఇద్దరు జవాన్ లు ఇంకా ఒక ఎస్ఐలు మృతి చెందారు.  ప్ర‌జ‌ల ప్రాణాలని కాపాడే క్ర‌మంలో వారు వీర మ‌ర‌ణం పొంద‌డం ప్ర‌తి ఒక్క‌రిని కంట త‌డి పెట్టిస్తుంది. వారి త్యాగానికి సామాన్యులు, సెల‌బ్రిటీలు సెల్యూట్ చేస్తున్నారు 

హంద్వారాలో అమ‌రులైన సైనికులకి టాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా నివాళి అర్పించ‌గా, తాజాగా నితిన్, సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్విట్ట‌ర్ ట్వీట్స్ చేశారు. ఆర్మీ సిబ్బంది డ్యూటీలో ఉన్నప్పుడు ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో సైనికులు అమ‌రుల‌య్యారని తెలిసి షాక్ అయ్యాను‌. ఇలాంటి నిరాశ స‌మ‌యాల‌లో వారి మ‌ర‌ణం మ‌రో షాక్. జ‌వాన్ల ఆత్మ శాంతించాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని నితిన్ పేర్కొన్నారు. ఇక సాయితేజ్ కూడా అమ‌రులైన సైనికుల త్యాగాల‌ని గుర్తు చేస్తూ, వారి కుటుంబాల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు


logo