చెక్ పెట్టేది ఎవరు?

‘ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు నితిన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘చెక్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘జైలు నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాం. చెస్ గేమ్‌లో నిష్ణాతుడైన ఓ ఖైదీ కథ ఇది. అతడు ఎలా జైలుపాలయ్యాడు? తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడా? లేదా?అన్నది ఆసక్తినిరేకెత్తిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుంది. నితిన్ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుంది. కథానాయికలు ప్రాముఖ్యమున్న పాత్రల్లో కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచే చిత్రమిది’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, త్రిపురనేని సాయిచంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కల్యాణిమాలిక్, ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్.
తాజావార్తలు
- నీట్ పీజీ-2021.. పెరిగిన ఫీజు, తగ్గిన ప్రశ్నలు
- టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బద్ధలుకొట్టిన మార్టిన్ గప్టిల్
- సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!
- గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై నిషేధం ఎత్తేసిన బైడెన్
- అనుమానాస్పదస్థితిలో ఆటో డ్రైవర్ మృతి
- ఒకే స్కూళ్లో 229 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్‌లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు