శనివారం 29 ఫిబ్రవరి 2020
ఏప్రిల్‌ 16న నితిన్‌ పెళ్లి

ఏప్రిల్‌ 16న నితిన్‌ పెళ్లి

Feb 15, 2020 , 16:36:40
PRINT
ఏప్రిల్‌ 16న నితిన్‌ పెళ్లి

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్ పెళ్లిపై అనేక ఊహాగానాలు నెల‌కొన‌గా ఎట్ట‌కేల‌కి ఓ క్లారిటీ వ‌చ్చింది. ఈ రోజు హైదరాబాద్‌లోని  త‌న‌ నివాసంలో షాలినితో క‌లిసి నిశ్చితార్ధ వేడుక‌ని జ‌రుపుకున్నాడు నితిన్‌. ఈ వేడుక‌కి  ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.  ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో నితిన్‌, షాలినిల  వివాహ వేడుక జర‌గ‌నుంద‌ని అంట‌న్నారు. ఇదిలా ఉంటే ఫిబ్ర‌వ‌రి 21న నితిన్ భీష్మ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఆ త‌ర్వాత రంగ్ దే, అందుదాన్ రీమేక్ చిత్రాల‌తో బిజీ కానున్నాడు నితిన్.

నితిన్ షాలినిని 2012లోనే క‌లిసారు . అయితే అప్పటికి ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. రెండేళ్ల క్రితమే ఇద్దరి స్నేహం ప్రేమగా మారిందట. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటుండడంతో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారట. షాలినికి వెరైటీగా ప్ర‌పోజ్ చేయాల‌ని భావించిన నితిన్   ఒంటికాలిపై నిలబడి ఆమెకి  ప్రపోజ్ చేసాడట. దాంతో నితిన్ చేష్టలు చూసి నవ్వుకున్న షాలిని వెంటనే అతని ప్రేమను ఒప్పుకున్నారట. నితిన్ సినిమాల‌ని త‌ర‌చూ చూస్తుండే షాలినికి  లై  సినిమా మాత్రం  అర్థం కాలేదట.  

logo