శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 00:14:05

రంగ్‌దే బ్యాక్‌ టూ సెట్స్‌

రంగ్‌దే బ్యాక్‌ టూ సెట్స్‌

నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు. లాక్‌డౌన్‌ విరామం అనంతరం బుధవారం హైదరాబాద్‌లో ఈసినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సరైన భద్రతా ప్రమాణాల్ని పాటిస్తూ పూర్తి జాగ్రత్తలతో చిత్రీకరణ జరుపుతున్నారు.ఈ సినిమా ఆన్‌లొకేషన్‌ స్టిల్స్‌ సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ అనుబంధాల సమ్మిళితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. మనసుల్ని కదిలించే భావోద్వేగాలతో పాటు చక్కటి వినోదంతో  ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచుతుంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన తాజా షెడ్యూల్‌లో నితిన్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. బ్యాలెన్స్‌గా ఉన్నా టాకీపార్ట్‌తో పాటు పాటల్ని కొద్ది రోజుల్లో పూర్తిచేస్తాం. 2021 సంక్రాంతికి ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్‌, కూర్పు: నవీన్‌ నూలి. 
logo