బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 02:51:50

యూరప్‌ పయనం

యూరప్‌ పయనం

నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల చివరి వారంలో తిరిగి ప్రారంభంకానుంది. నితిన్‌, కీర్తిసురేష్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు పాటల్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో పదిహేను రోజులు షూటింగ్‌ చేసిన తర్వాత చిత్రబృందం యూరప్‌కు పయ నం కాబోతున్నట్లు సమాచారం. తొలుత ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావించారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ నిలిచిపోవడంతో కుదరలేదు.   వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాల్ని సమకూర్చుతున్నారు. 
logo