బుధవారం 03 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 18:45:07

నితిన్-ప్రియావారియ‌ర్ ‘చెక్’ వీడియో సాంగ్ విడుదల

నితిన్-ప్రియావారియ‌ర్ ‘చెక్’ వీడియో సాంగ్ విడుదల

నితిన్ చెక్ సినిమా ఈ వారమే విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ కూడా పెరిగిపోయాయి. ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అంటూ పాటను విడుదల చేసారు. ఇదివరకే లిరికల్ సాంగ్ వచ్చింది..ఇప్పుడు వీడియో ప్రోమోను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో ప్రియా వారియర్ అందాల ఆరబోతతో పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్లు. 

ఇప్పటి వరకు చంద్రశేఖర్ యేలేటికి ప్రశంసలు తప్ప పైసలు వచ్చే సినిమాలు రాలేదు. ఒకట్రెండు సినిమాలు బాగానే ఆడినా కూడా అవి బ్లాక్ బస్టర్స్ కావు. దాంతో ఈ దర్శకుడితో సినిమా అంటే పేరుకు ఓకే కానీ కమర్షియల్ గా కాదని అభిప్రాయానికే వచ్చేసారు హీరోలు. ఇలాంటి సమయంలో తనలో కమర్షియల్ కోణం కూడా ఉందని నిరూపించుకోడానికి చెక్ సినిమా చేసానని చెప్పాడు యేలేటి. పైగా మంచి ఫామ్ లో ఉన్న నితిన్ దొరికేసరికి సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. 

సినిమాలో ప్రియ కారెక్టర్ నిడివి ఎంతగా ఉంటుందో తెలియదు కానీ ప్రమోషన్స్ లో మాత్రం మొత్తం ఈమెనే కనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్ గా నటించినా కూడా ఈమె మాత్రం అస్సలు బయట కనిపించడం లేదు. పైగా చెక్ లో ఈమె పాత్రపై అసంతృప్తిగా ఉందని.. అందుకే ప్రమోషన్స్ కు కూడా రావడం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ప్రియా వారియర్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడేసుకుంటుంది.

అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డు చెప్పకుండా అందాల విందు ఇచ్చేసింది. రేపు చెక్ విడుదలైన తర్వాత కచ్చితంగా స్టార్స్ కన్ను ఈమెపై పడుతుందనడటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అందాల నిధిని బాగానే కెమెరాలో బంధించాడు చంద్రశేఖర్ యేలేటి. మరి ఈ సినిమాతో ప్రియా జాతకం ఎంతవరకు మారిపోతుందో చూడాలి

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo