శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 08:23:29

మూడు గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్న నితిన్ ..!

మూడు గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్న నితిన్ ..!

యూత్ స్టార్ నితిన్ ఈ ఏడాది మంచి జోరు మీదున్నాడు. ఈ కుర్ర హీరో న‌టించిన చెక్ ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇక నితిన్ న‌టించిన మ‌రో చిత్రం రంగ్ దే. మార్చి 26న చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రోవైపు నితిన్ .. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్  దుబాయ్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. ‘అంధాదున్’ సినిమాకి  రేమ‌క్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న న‌భా న‌టేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.  జూన్ 11న  చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల పేర్కొన్నారు.

ఇక నితిన్‌ హీరోగా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్న సంగతి తెలిసిందే . ప‌వ‌ర్ పేట అనే టైటిల్‌తో కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ మూవీలో నితిన్ మూడు గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. 20 ఏళ్ళు, 40 ఏళ్లు, 60 ఏళ్ళు ఇలా మూడు పాత్ర‌ల‌లో వైవిధ్య‌మైన న‌ట‌న‌తో అల‌రించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కిస్తారని, తెలుగుతో పాటు త‌మిళంలోను ఈ మూవీ విడుదల కానుందని స‌మాచారం. 

VIDEOS

logo