శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 10:38:16

రెడ్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న నితిన్, ప్ర‌గ‌తి

రెడ్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న నితిన్, ప్ర‌గ‌తి

పాపులర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు సంబంధించిన ఫోటోలు, జిమ్ వీడియోలు రెగ్యుల‌ర్‌గా షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని ఎంతగానో అల‌రిస్తూ వ‌స్తుంది ప్ర‌గ‌తి . తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో నితిన్‌తో దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఇద్ద‌రు రెడ్ ఔట్ ఫిట్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నారు. ఇది ఏ స‌న్నివేశంలో దిగిన ఫోటో అనే దానిపై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో అభిమానులు రంగ్‌దే మూవీ చిత్రీక‌ర‌ణ‌లో అని భావిస్తున్నారు. మ‌రి కొంద‌రు ఇటీవ‌ల జ‌రిగిన ఓ యాడ్ షూటింగ్‌లో స‌న్నివేశంకు సంబంధించిన ఫోటో అని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. logo