శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 13:37:17

నిశ్శ‌బ్ధం ట్రైల‌ర్ విడుద‌ల‌.. మూవీపై పెరిగిన అంచ‌నాలు

నిశ్శ‌బ్ధం ట్రైల‌ర్ విడుద‌ల‌.. మూవీపై పెరిగిన అంచ‌నాలు

అందాల భామ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో హేమంత్‌ మధుకర్ తెర‌కెక్కించిన చిత్రం నిశ్శ‌బ్ధం. అక్టోబ‌ర్ 2న ఓటీటీలో విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్ కొద్దిసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. రానా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో సాక్షి అనే  దివ్యాంగురాలి పాత్ర‌లో అనుష్క ఆకట్టుకునేలా న‌టించింది. అనుష్క బెస్ట్‌ ఫ్రెండ్ సోనాలి పాత్రలో షాలినిపాండే నటించగా, అనుష్కను ప్రేమించే వ్యక్తిగా మాధవన్‌ నటిస్తున్నారు

ట్రైల‌ర్‌ని ఆస‌క్తిక‌ర అంశాల‌తో క‌ట్ చేశారు. దెయ్య‌ముండే ఇంట్లోకి మాధ‌వ‌న్ ,అనుష్క వెళ్ళ‌డం అక్క‌డ వారికి ఎదుర‌య్యే ప‌రిస్థితులు, సోనాలి క‌డ‌పడ‌కుండా పోవ‌డం ఇలాంటి విష‌యాల‌తో ట్రైల‌ర్ ఆస‌క్తి రేపుతుంది. చిత్రంలో హీరోయిన్ అంజ‌లి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.