శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 18:50:57

‘నిశ్శబ్ధం’ నిర్మాతలకు సేఫ్‌ ప్రాజెక్టే

‘నిశ్శబ్ధం’ నిర్మాతలకు సేఫ్‌ ప్రాజెక్టే

ప్రముఖ నటి అనుష్క నటించిన చిత్రం ‘నిశ్శబ్ధం’ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో కోనవెంకట్‌, విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల అమోజన్‌ప్రైమ్‌లో నేరుగా విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా థియేట ర్లు మూతపడటంతో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. ఈ చిత్రం చూసిన వాళ్లు పెదవి విరుస్తున్నారు.పాత కథతో ఎటువంటి కొత్తదనం లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై ఆర్థికంగా నష్టపోకుండా లక్కీగా ఎస్కేప్‌ అయ్యారని అంటున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భా ష ల్లో రూపొందిన  ఈ చిత్రానికి అన్ని భాష ల్లో ఓటీటీ హక్కులు కలుపుకొని అమోజాన్‌ వాళ్లుగట్టిగానే ముట్టజెప్పారట. అంతేకాదు ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం నిర్మాతలు ఆర్థికంగా కూడా సేఫ్‌ జోన్‌లోనే వున్నారట. సో.. అనుష్క ‘నిశ్శబ్ధం’కు కరోనా కాలం కలిసి వచ్చిందనే చెప్పాలి.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.