శనివారం 16 జనవరి 2021
Cinema - May 17, 2020 , 09:01:44

నిశ్శ‌బ్ధం సినిమా పుకార్ల‌ని ఖండించిన యూనిట్..!

నిశ్శ‌బ్ధం సినిమా పుకార్ల‌ని ఖండించిన యూనిట్..!

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో శాంతించేలా లేదు. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే ప‌రిస్థితి ద‌రిదాపుల్లో కూడా క‌నిపించ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో తాము నిర్మించిన సినిమాలు ఎలా రిలీజ్ చేయాలో తెలియ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. కొంద‌రైతే త‌మ సినిమాల‌ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌డం లేదు.

తెలుగులో ఇప్ప‌టికే అమృత‌రామమ్ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల కాగా, పెంగ్విన్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ద‌మైంది. ఇక కొద్ది రోజులుగా అనుష్క న‌టించిన నిశ్శ‌బ్ధం కూడా ఓటీటీలోనే విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.దీనిపై  నిర్మాత‌లు మ‌ధ్య ఖండించిన‌ప్ప‌టికీ, మ‌ళ్ళీ పుకార్లు మొద‌ల‌య్యాయి. ఎంతో క‌ష్ట‌ప‌డి తీసిన నిశ్శ‌బ్దం సినిమాని థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు క‌న్‌ఫాం చేసిన‌ట్టు తెలుస్తుంది.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది.