శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 20:27:09

సీక్వెల్ కు ప్లాన్ చేస్తోన్న నిశ‌బ్ధం డైరెక్ట‌ర్..!

సీక్వెల్ కు ప్లాన్ చేస్తోన్న నిశ‌బ్ధం డైరెక్ట‌ర్..!

టాలీవుడ్ బ్యూటీ అనుష్క, మాధ‌వ‌న్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం నిశ‌బ్దం. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్టు సీక్వెల్ కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌న్న వార్త ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

నిశ‌బ్ధం ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో డైరెక్ట‌ర్ హేమంత్ మధుక‌ర్ ఈ విష‌యాన్ని చెప్పాడు. ఎనిమిదేళ్ల క్రితం రాసుకున్న క‌థ‌తో నిశ‌బ్ధం చిత్రం తీసిన హేమంత్ కు ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. అయితే మ‌రి ఈ ప్రాజెక్టు‌కు సీక్వెల్ చేస్తే ఎంత‌వ‌ర‌కు  ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అంజ‌లి,అవ‌స‌రాల ‌శ్రీనివాస్,షాలినీ పాండే ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.