ఆదివారం 24 జనవరి 2021
Cinema - May 22, 2020 , 21:01:53

థియేటర్లలో నిశ్శబ్ధం తెస్తాం...

థియేటర్లలో నిశ్శబ్ధం తెస్తాం...

తెలుగులో హీరోలతో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటి అనుష్క. ఆమె ప్రధాన పాత్రల్లో వచ్చిన అరుంధతి, రుద్రమదేవి వంటి చిత్రాలకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే ప్రస్తుతం అనుష్క ప్రదాన పాత్రలో ఎన్నో అంచనాలతో వస్తున్న ప్రయోగాత్మక చిత్రం నిశ్శబ్ధం చిత్రం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా థియోటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో చాలా మంది ఈ చిత్రం ఓటీటీలో వస్తుందని అంచనాలు వేసారు. 

అయితే ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు లేవని నిర్మాత కోన వెంకట్‌ ప్రకటించారు. త్వరలో థియేటర్లు తెరుచుకుంటాయని అందుకు అవకాశాలున్నాయని ఆయన అంచనా వేసారు. ఒకవేళ ఇంకా చాలా కాలం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేనప్పుడు ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చేస్తామని అన్నారు.


logo