శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 09:52:10

నిన్నే పెళ్ళాడతా@25.. నాగ్‌కు మ్యూజిక‌ల్ గిఫ్ట్

నిన్నే పెళ్ళాడతా@25.. నాగ్‌కు మ్యూజిక‌ల్ గిఫ్ట్

అక్కినేని నాగార్జున కెరియ‌ర్‌లో నిన్నే పెళ్ళాడ‌తా అనే చిత్రంకు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. 1996 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన ఈ  చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది.  అక్కినేని నాగార్జున, టబు ప్రధాన పాత్రలు పోషించగా, సందీప్ చౌతా మ్యూజిక్ అందించారు. ఎటో వెళ్ళిపోయింది మనసు.., గ్రీకు వీరుడు నా రాకుమారుడు ..,  నిన్నే పెళ్లాడేస్తానంటూ .., కన్నుల్లో నీ రూపమే .., నా మొగుడూ రాంప్యారీ పాను దెచ్చీ ఫ్యానేయ్మంటాడే.. , నువ్ నాతో రా, తమాషాలలో తేలుస్తా, హే ఆవారా సుఖాలేమిటో చూపిస్తా, రికామీగా షికారేద్దాం, ఆకాశంలో మకామేద్దాం... ఇలా అద్భుత‌మైన సాంగ్స్‌తో సంగీత ప్రియుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేశారు సందీప్

నిన్నే పెళ్ళాడ‌తా చిత్రం అక్టోబ‌ర్ 04,1996న విడుద‌ల కాగా, నిన్న‌టితో  24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా  సంగీత దర్శకుడు సందీప్ చౌతా.. నాగార్జున‌కు ఓ మ్యూజికల్‌ గిప్ట్‌ను పంపారు. ఎటో వెళ్లి డైరీస్ అనే పేరుతో పంపిన గిఫ్ట్‌ని నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ.. సందీప్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలానే మ్యూజిక్ గిఫ్ట్‌కు వ‌ర్క్ చేసిన అంద‌రిని అభినందించారు. అయితే ఎటో వెళ్లి డైరీస్ ఆల్బ‌మ్‌కు నాగ చైత‌న్య‌, అఖిల్ కూడా  ఫుల్ ఇంప్రెస్ కాగా, వాటిని త‌మ ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.