e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News నిఖిల్‌ని ఆట‌ ప‌ట్టించిన అనుప‌మ‌.. వీడియో వైర‌ల్

నిఖిల్‌ని ఆట‌ ప‌ట్టించిన అనుప‌మ‌.. వీడియో వైర‌ల్

నిఖిల్‌ని ఆట‌ ప‌ట్టించిన అనుప‌మ‌.. వీడియో వైర‌ల్

యంగ్ హీరో నిఖిల్‌, మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’ . మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, కొత్తగా ఫ్రెష్‌గా ఉంది. నా పేరు నందిని అంటూ అనుపమ తన గురించి పరిచయం చేసుకోవడం, తన మనసులో ఉన్నది పేపర్ మీద ఇలా రాయడం తనకిష్టమని చెప్పుకొచ్చారు అనుప‌మ‌. ఈ ఫ‌స్ట్ లుక్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

తాజాగా నిఖిల్ షూటింగ్ స‌మ‌యంలో జరిగిన అల్ల‌రి గురించి ఓ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. ఫ‌స్ట్ లుక్ కోసం ప్ర‌త్యేక షూట్ చేయ‌గా, ఆ స‌మ‌యంలో అనుప‌మ సారంగదరియా పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్‌ చేస్తూ నిఖిల్‌ని ఆట‌ప‌ట్టిస్తుంది.. ఈ వీడియోని నిఖిల్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘నేను ఇంత వరకు చూసిన వారందరిలోనూ ఎంతో సంతోషంగా ఉండే వారిలో అనుపమ ది బెస్ట్‌’అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనిపై స్పందించిన అనుప‌మ‌.. మొత్తానికి ఒప్పుకున్నావ్ అని పేర్కొంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిఖిల్‌ని ఆట‌ ప‌ట్టించిన అనుప‌మ‌.. వీడియో వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement