మంగళవారం 26 మే 2020
Cinema - Apr 28, 2020 , 15:09:06

కాబోయే భార్య‌ని దూరం నుండే ప్రేమిస్తున్న నిఖిల్

కాబోయే భార్య‌ని దూరం నుండే ప్రేమిస్తున్న నిఖిల్

క‌రోనా మ‌హ‌మ్మారి ఎంద‌రో జీవితాల‌ని చిన్నాభిన్నం చేసింది. ఈ వైర‌స్ వ‌ల‌న ప్ర‌జ‌ల‌లో సంతోషాలు, ఆనందాలు దూర‌మ‌య్యాయి. ముందుగానే కుదుర్చుకున్న‌ పెళ్లిళ్లు, ఫంక్ష‌న్స్ అన్నీ వాయిదా ప‌డ్డాయి. ఈ కరోనా రోగం ఎప్పుడు వ‌దులుతుందా అని ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నారు. 

టాలీవుడ్ యంగ్ హీరోస్ నితిన్, నిఖిల్ ఏప్రిల్ 16న పెళ్లి పీట‌లెక్కాల్సి ఉండ‌గా, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. ఎప్పుడు జ‌రుగుతుందో కూడా తెలియ‌క సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా నిఖిల్ త‌న‌కి కాబోయే భార్య‌ని గుర్తు చేసుకుంటూ ..మ‌నం త్వ‌ర‌లోనే ఒక‌టి కాబోతున్నాం. ఇప్ప‌టికైతే దూరం నుండి ప్రేమిస్తూ ఉంటాన‌ని చెబుతూ ఒక బీచ్ ఒడ్డున ప‌ల్ల‌వితో దిగిన పోటోని షేర్ చేశాడు. ఇదిలా ఉంటే నిఖిల్ ఇప్ప‌టికే ప‌ల్ల‌వితో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. 


logo