ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 06:52:30

నిఖిల్ ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మైన ఖ‌రీదైన రేంజ్ రోవర్

నిఖిల్ ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మైన ఖ‌రీదైన రేంజ్ రోవర్

హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన యువ హీరో నిఖిల్.. స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాల‌తో సోలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌త ఏడాది త‌న ప్రేయ‌సిని పెళ్లాడాడు. ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు కొనుగోలు చేశాడు.

కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసిన విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన నిఖిల్‌..  అర్జున్ సురవరం’ విజయం సాధించడంతో నాకు నేను దీన్ని బహుబతిగా ఇచ్చుకున్నాను. కొవిడ్ వల్ల ఇది నా దగ్గరకు రావడం కాస్త ఆలస్యమైంది అంటూ క్యాప్ష‌న్ రాశాడు. ఈ కారు ఖ‌రీదు .2 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ 2 చిత్రాన్ని చేస్తున్నాడు నిఖిల్. మ‌రోవైపు  గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ‘18 పేజస్’ అనే సినిమా కూడా చేస్తున్నారు నిఖిల్.


VIDEOS

logo