గురువారం 28 మే 2020
Cinema - May 04, 2020 , 08:36:25

అంతా స‌ర్ధుకున్నాకే పెళ్లి చేసుకుంటా: నిఖిల్

అంతా స‌ర్ధుకున్నాకే పెళ్లి చేసుకుంటా:  నిఖిల్

క‌రోనా వ‌ల‌న ప్ర‌పంచం కుదేలైంది. ప్ర‌జ‌ల జీవన విధానం అస్త‌వ్య‌స్తం అయింది. స‌మ్మ‌ర్‌లో జ‌రిగే ఎన్నో పెళ్లిళ్లు , వేడుకలు వాయిదా ప‌డ్డాయి. ఏప్రిల్ 16న జ‌ర‌గాల్సిన హీరో నిఖిల్ పెళ్ళి కూడా కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కరోనాతో పోరాటం ముగిసే వరకు మా పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం అని నిఖిల్ చెప్పుకొచ్చారు.

ప్ర‌జ‌ల బాధ‌ల‌తో పోలిస్తే మా బాధేమి పెద్ద‌ది కాదు. ఈ  స‌మ‌యంలో పెళ్ళి చేసుకున్న‌ప్ప‌టికీ, వ‌చ్చిన వారిలో ఎవ‌రికైన క‌రోనా సోకితే , ఆ బాధ న‌న్ను జీవితాంతం వేదిస్తుంది. పెళ్లి అనేది మ‌ర‌పురానిగా ఉండాల‌ని నేను కోరుకుంటాను. ఎంతో వేడుక‌గా జ‌రుపుకోవాల‌ని భావించిన మేం ఇలాంటి క‌ష్ట కాలంలో చేసుకోక‌పోవ‌డమే మంచిద‌ని నిర్ణ‌యించుకున్నాం. ప‌ల్ల‌వి, నేను మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని పేర్కొన్నాడు నిఖిల్ . కాగా, ఫిబ్రవరిలో డాక్టర్‌ పల్లవి వర్మతో నిఖిల్‌ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.  


logo