సోమవారం 01 జూన్ 2020
Cinema - May 17, 2020 , 08:49:18

వైర‌ల్‌గా మారిన నిఖిల్- ప‌ల్లవి మ్యారేజ్ వీడియో

వైర‌ల్‌గా మారిన నిఖిల్- ప‌ల్లవి మ్యారేజ్ వీడియో

యంగ్ హీరో నిఖిల్ మే 14న త‌న ప్రేయ‌సి ప‌ల్ల‌వి వ‌ర్మని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ 19వ‌ల‌న కొద్ది మంది స‌మ‌క్షంలోనే నిఖిల్ వివాహం జ‌రిగింది. నూత‌న దంప‌తుల‌కి అభిమానులు, శ్రేయోభిలాషులు, స‌న్నిహితులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.  అయితే త‌న పెళ్ళికి అంద‌రిని ఆహ్వానించాల‌ని అనుకున్నా కాని , క‌రోనా వ‌ల‌న సాధ్యం కాలేద‌ని చెప్పుకొచ్చారు.

అభిమానుల కోసం త‌న పెళ్ళి వీడియో విడుద‌ల చేసిన నిఖిల్‌.. వీడియో ద్వారా ఆశీస్సులు, శుభాకాంక్ష‌లు అందించండి. నాకు ఇష్ట‌మైన పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది అని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు నిఖిల్. మీరు ఈ వీడియో చూసి ఆనందించండి


logo